ఆర్కేపురం/ బడంగ్‌పేట, ఏప్రిల్ 4 : అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం 58జీవో కింద సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సరూర్‌నగర్ డివిజన్‌కు చెందిన 113 మందికి, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 305 మం దికి, తుక్కుగూడ మున్సిపాలిటీలో 75 మందికి ఎమ్మెల్సీలు యెగ్గ్గే్గ మల్లేశం, బొగ్గారపు దయానంద్గుప్తాతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏండ్లుగా ప్ర భుత్వ స్థలాల్లో నివాసముంటున్న పేద ప్రజలకు 58, 59 జీవోల కింద పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గం లో 1248 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, కందుకూరు ఆర్డీవో సూరజ్, తహసీల్దార్ జయశ్రీ, మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, మురుకుంట్ల అరవింద్, మాజీ యూత్వింగ్ అధ్యక్షు డు లోకసాని కొండల్‌రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, గడ్డిఅన్నారం మా ర్కెట్ మాజీ చైర్మన్ రాంనర్సింహాగౌడ్, నాయకులు దర్పల్లి అశోక్, సిరిపురం రాజేశ్‌గౌడ్, కొండ్ర శ్రీనివాస్, దర్శన్ ముదిరాజ్, రాఘవేంద్రగుప్త, పి.రాజు, ప్రత్యూష్, స్వప్న పాల్గొన్నారు.