అంబేద్కరుడికి.. నీరాజనం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు, వాడవాడలా ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పించి జనం నీరాజనం పలికారు.
- ఊరూరా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు ఘనంగా నివాళులు
- జై భీమ్ నినాదాలతో మార్మోగిన పల్లెలు, పట్టణాలు
- భారీ బైక్ ర్యాలీల నిర్వహణ
- పలుచోట్ల వేడుకల్లో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు
- అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు
- హైదరాబాద్‌లో జరిగిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు, వాడవాడలా ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పించి జనం నీరాజనం పలికారు. నీలిరంగు జెండాలు చేతబూని పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. జైభీమ్, జైజై అంబేద్కర్ నినాదాలతో ఉమ్మడి జిల్లా మార్మోగింది. మహేశ్వరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ పనిచేస్తుందన్నారు. నేటి యువత అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు హైదరాబాద్‌లో జరిగిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట, ఏప్రిల్ 14 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిప్రదాత అని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం చందన చెరువు దగ్గర ఏర్పాటు చేసిన ఓ పెన్ జిమ్, చిల్డ్రన్ పార్కును ప్రారంభించారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జ యంతిని జరుపుకొంటారని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారన్నారు. కార్యక్రమంలో మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ శేఖర్, బీఆర్ఎస్ పార్టీ మీర్‌పేట అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, బడంగ్‌పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ జయంత్యుత్సవాల కమిటీ నాయకులు, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

