కోట్‌పల్లి, సెప్టెంబర్ 21 : కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మితే 60 ఏండ్లు వెనక్కి పో తామని సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 60 ఏండ్లలో చేయ ని అభివృద్ధి 9 ఏండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూ యించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దశల వారీగా అభివృద్ధిని చేస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. గురువారం కోట్‌పల్లి నూతన మార్కెట్ కమిటీ ప్రమా ణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రితో పాటు తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కో ట్పల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమ్ము మణె మ్మ, వైస్ చైర్మన్ ఫయాజోద్దిన్, డైరెక్టర్లు ఉప్పరి నారాయణ, రాథోడ్ రాంశెట్టి, అంజిలయ్య, ల క్ష్మణ్, అనిల్‌కుమార్, వెంకట్రాంరెడ్డి, కుమ్మరి కవిత, అనంతయ్య, శ్రీనివాస్, మహ్మద్ షఫీ, శ్రీధర్, విజయ్‌కుమార్, విష్ణువర్ధన్రెడికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పాలనను చేరువ చే యాలనే ఉద్దేశంతో రైతులకు రెవెన్యూ రంగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. అ లాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు, నూతన మార్కెట్లు, కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. అధికారంలోకి వచ్చిన 9 ఏండ్లలోనే అనేక పథకాలను అమలు పరిచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. జిల్లాలో 65వేల మంది రైతులకు రూ.353 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మాదే అని అన్నారు. రంగారెడ్డి జిల్లాల్లో కొత్త గోదాంల నిర్మాణానికి రూ.38 కోట్లను అందించామని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లాలో సుమారు రూ.3వేల కోట్లతో రైతులకు రైతుబంధు అందించామన్నారు. రూ.236 కోట్లతో రైతుబీమాను అందించి ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి భరోసానిచ్చారని మంత్రి అన్నారు.
గిట్టుబాటు ధరలు అందిస్తున్నాం
ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, ఆనంద్ మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కొత్త మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను అందిస్తున్నామ న్నారు. రైతులకు చేరువలో ఉన్న మార్కెట్ యా ర్డుల్లోనే పంటలను అమ్ముకొని మంచి లాభాల ను ఆర్జిస్తున్నారన్నారు. కార్యక్రమంలో గాజీపూర్ నారాయణరెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎం పీపీ ఉమాదేవి, గ్రంథాలయ చైర్మన్ రాజూగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్, మా జీ వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్, సర్పంచ్ లక్ష్మీవెంకటయ్య, మార్కెట్ కమిటీ కార్యదర్శి లక్ష్మణ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.