పారిశ్రామిక ప్రగతి షాబాద్‌కు సరికొత్త వన్నె తెస్తున్నదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాల్లోని పారిశ్రామిక వాడల్లో కిటెక్స్, సింటెక్స్ కంపెనీల యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రోహిత్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 250 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద కిటెక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాబోయే ఏడేండ్లలో సీతారాంపూర్, చందనవెల్లిలో వెల్స్పన్ గ్రూప్ ద్వారా రూ.5వేల కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు 50వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధి బాలకిషన్ గోయెంకా చెప్పడం సంతోషకరమన్నారు.
గుజరాత్, కర్ణాటకలో పెట్టాల్సిన కంపెనీలు ఇక్కడికి రావడం కేసీఆర్ ఘనతనేనన్నారు. షాబాద్‌లో తయారు చేసే టైల్స్‌ను ప్రపంచానికి సరఫరా చేయడం గొప్ప పరిణామమన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షమవుతున్నదన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శమన్నారు. కేటీఆర్ కృషితో దేశ, విదేశీ పెట్టుబడిదారులు తెలంగాణలో తమ యూనిట్ల ఏర్పాటుకు క్యూ కడుతున్నారన్నారు. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ర్టానికి ముందు.. ఇప్పుడు షాబాద్ ప్రాంతం ఎలా ఉండేది ప్రజలు గమనించాలన్నారు. రాబోవు రోజుల్లో షాబాద్ మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. బడా కంపెనీలతో స్థాని కంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
షాబాద్, సెప్టెంబర్ 28 : సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో రూ.1750 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న కిటెక్స్, సింటెక్స్ పరిశ్రమలకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పైలట్ రోహిత్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, వెల్స్పన్ కంపెనీ ప్రతినిధి బాలకిషన్, కలెక్టర్ హరీశ్‌తో కలిసి శంకుస్థాపనలు చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఐదు నుంచి ఏడేండ్ల సమయంలో సీతారాంపూర్, చందనవెల్లిలలో వెల్స్పన్ గ్రూప్ ద్వారా రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 50 వేల మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధి బాలకిషన్ చెప్పడం సంతోషకరమన్నారు.
ఒకటి గుజరాత్లో.. మరొకటి కర్ణాటకలో పెట్టాల్సిన కంపెనీలు తెలంగాణకు వచ్చాయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వం ఉన్నదన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని.. శాంతిభద్రతలు, పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు, సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఎక్కువగా ఉద్యోగావకాశాలు కల్పించాలని రెండు కంపెనీల ప్రతినిధులకు మంత్రి సూచించారు. షాబాద్‌లో తయారు చేసే టైల్స్ ను ప్రపంచానికి సరఫరా చేయడం గొప్ప పరిణామమన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి లక్కీ ఎంపీగా నిలిచారన్నారు.. ఎందుకంటే ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలోని మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ త్వరలో రానున్నదని.. చేవెళ్లలోనూ పెద్ద, పెద్ద కంపెనీలు ఏర్పాటు కానున్నాయని.. వికారాబాద్‌కు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, తాండూరుకు పలు పరిశ్రమలు, పరిగిలో ఆహారశుద్ధి పరిశ్రమలు రానున్నాయని.. దీంతో ఈ ప్రాంతాల్లో భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగనున్నదన్నారు. జిల్లాలోని యువత రియల్ ఎస్టేట్ వైపు దృష్టి సారిస్తున్నారని.. వారిని పరిశ్రమల వైపు మళ్లీస్తే బాగుంటుందని ఎంపీకి మంత్రి కేటీఆర్ సూచించారు.
Ktr
షాబాద్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం
చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుతో షాబాద్ ప్రాంతానికి వన్నె తెచ్చేలా ప్రగతి జరుగుతున్నదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాల్లోని పారిశ్రామికవాడల్లో పలు కంపెనీలకు శంకుస్థాపనలు చేసేందుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రికి చేవెళ్లలోని షాబాద్ చౌరస్తాలో ఎమ్మెల్యే కాలె యాదయ్య బొకె అందజేసి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా సీతారాంపూర్ వద్ద జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సీతారాంపూర్ చౌరస్తా వద్ద మంత్రి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య తదితరులతో కలిసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. చందనవెల్లి, సీతారాంపూర్లలో పరిశ్రమల ఏర్పాటుతో షాబాద్ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నదనన్నారు. 250 ఎకరాల్లో ఏర్పాటు కానున్న కిటెక్స్ సంస్థ ద్వారా వేలాది మంది మహిళలకు ఇక్కడ ఉపాధి లభిస్తుందన్నారు. అదేవిధంగా సింటెక్స్ కంపెనీ యూనిట్ ఏర్పాటుతో పలువురికి ఉద్యోగావకాశాలు మెరుగవుతాయన్నారు.
ఇక్కడి ఉత్పత్తులు ప్రపంచానికి సరఫరా కావడం గొప్ప పరిణామమన్నారు. సీతారాంపూర్, హైతాబాద్ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కావాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య తరచుగా తమ దృష్టికి తీసుకొస్తుంటారని.. యాదయ్య లాంటి ప్రజల మనిషిని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. చందనవెల్లిలో చిన్న ప్లాట్ల సమస్యను త్వరలో పరిష్కరించుకుందామన్నారు. సీతారాంపూర్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే ప్రజలకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, మర్పల్లి మాలతి, ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గూడూరు నర్సింగ్‌రావు, చల్లా శ్రీరాంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, సీతారాంపూర్ సర్పంచ్ కొత్త పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్‌గౌడ్, పోన్న నర్సింహారెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు పీసరి సతీశ్‌రెడ్డి, ఉప సర్పంచ్ సందీప్, పార్టీ నాయకులు వాసుదేవారెడ్డి, డాక్టర్ రాజు, జీవన్‌రెడ్డి, గణేశ్‌గౌడ్, అన్వర్, రమేశ్‌యాదవ్, నానిగౌడ్, నర్సింహులు, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం.. బీఆర్ఎస్ జెండావిష్కరణ..
షాబాద్ పర్యటనకు వెళ్తున్న ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. చేవెళ్లలోని షాబాద్ చౌరస్తాలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీతారాంపూర్ వద్ద జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. సీతారాంపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి ప్రసంగించారు.
మంత్రి కేటీఆర్ చొరవతోనే..
తెలంగాణ వస్తే ఏమి వస్తుందని ప్రశ్నించిన వారికి దేశ, విదేశాలకు చెందిన పలు కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగడమే నిదర్శనం. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తున్నది. సాయంత్రం సమయంలో చేవెళ్ల, షాబాద్ ప్రాంతాలను చూస్తే హైదరాబాద్‌ను తలపించేలా కనిపిస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణకు కంపెనీలు వచ్చి భారీ స్థాయి లో పెట్టుబడులు పెడుతున్నాయి. మరో 20 ఏండ్ల్లపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుంది. రైతులకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతున్నది. – కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
మారనున్న షాబాద్ రూపురేఖలు
షాబాద్ ప్రాంతం ఒకప్పుడు ఏలా ఉన్నది.. ఇప్పుడు ఏట్లున్నదో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గమనించాలి. రానున్న ఐదేండ్ల కాలంలో ఇంతకన్నా ఎక్కువ పెట్టుబడులు ఇక్కడికి రానున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో దేశ, విదేశాలకు చెందిన పలు కంపెనీలు ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. దీంతో షాబాద్ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. వెల్స్పన్ కేరాఫ్ హైదరాబాద్‌గా మారింది. పెట్టుబడుల ఆకర్షణలో కేటీఆర్ దిగ్రేట్ అని పేపర్లలో వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. -రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ
దేశానికే ఆదర్శం..తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం
సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగా ణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. మంత్రి కేటీఆర్ కృషితో దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వరదలా రాష్ర్టాని కి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారింది. వేలాది మందికి ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రపంచ చిత్రపటం లో షాబాద్ మండలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రూ.370 కోట్ల తో ఏర్పాటు చేస్తున్న సింటెక్స్ కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రూ.1400 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ పరిశ్రమలో 12 వేల మందికి ఉపాధి దొరుకనున్నది. రంగారెడ్డి జిల్లాలో 1358 పరిశ్రమలను రూ.62,832 కోట్లతో స్థాపించ గా 7లక్షల 6వేల మంది వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోనూ అనువైన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు మంత్రి కేటీఆర్‌తో కలిసి సీఎం కేసీఆర్‌కు నివేదిస్తాం.
-పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి