ఎన్నికలంటే ఆగం కాకుండా ఆలోచించి ఓటేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం, మర్పల్లిలలో బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్‌కు మద్దతుగా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజీతోపాటు డిగ్రీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎన్కతల, అర్కతలలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. మర్పల్లి-మోమిన్‌పేట రోడ్డును రూ.12 కోట్లతో వేస్తామన్నారు. 2014కు ముందు వికారాబాద్ ఎట్లుండే, ఇప్పుడెట్లుందో ప్రజలు బేరీజు వేసుకొని ఓటేయాలన్నారు. మరింత ప్రగతి జరుగాలంటే మెతుకు ఆనంద్‌ను గెలిపించుకోవాలన్నారు.
-వికారాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దని.. ఆలోచించి ఓటేయాలని, ఆనంద్‌ను మరోసారి ఆశీర్వదించి అభివృద్ధిని ప్రోత్సహించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ పట్టణం, మర్పల్లి మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్‌కు మద్దతుగా రోడ్‌షోలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు. 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదని.. కానీ.. తెలంగాణ ఏర్పా టై కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజల 40 ఏండ్ల కల అయిన వికారాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు వికారాబాద్‌లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, ప్రభుత్వ మెడికల్, న ర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో అనుబంధంగా 500 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, గుండెజబ్బుతోపాటు ఎలాంటి పెద్ద జబ్బుకైనా ఇక్కడే వైద్యసేవలు అందుతున్నాయ న్నారు. మోమిన్‌పేట సమీపంలోని ఎన్కతల, అర్కతలలో భారీ ఎత్తు న పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారని, ఏడాదిలోగా కృష్ణా జలాలను వికారాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. మర్పల్లి-మోమిన్‌పేట నాలుగు లేన్ల రోడ్డుకు రూ.12 కోట్లు మంజూరు చేసి మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే త్వరగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మర్పల్లి మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తామన్నారు.
2014 కు ముందు కరెంట్‌లేక అర్ధరాత్రి పొలాల వద్ద పడిగాపులు, కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుదాఘాలతో రైతుల మరణాలు, చెరువులు ఎండిపోయి, రైతులు వలసలు పోయిన పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ పాలకుల హయాంలో అన్ని వర్గాల వారు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణ బతుకులు మారుతున్నాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, రైతుబంధు పథకంతో పెట్టుబడిసాయాన్ని అందిస్తున్నది తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుబీమాతో బాధిత రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నదన్నారు.
అన్నదాతల అభ్యున్నతికో సం పలు రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల తర్వాత స్నానాలు చేసేందుకు 10-20 నిమిషాలు కరెంట్ ఇవ్వాలని బతిమి లాడే పరిస్థితులుండేవని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నదన్నారు. నన్ను గెలిపిస్తే బీఆర్ఎస్లోకి వెళ్తానని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో చెప్పుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అయితే ఆయన అవసరం మా పార్టీకి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే వారిని భారీ మెజార్టీతో గెలిపిస్తా యి. వికారాబాద్ జిల్లాతోపాటు కొత్త మండలాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందాం.
– పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి
మర్పల్లి, మోమిన్‌పేట, బంట్వారం మండలాల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను చూస్తూంటే కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. వికారాబాద్‌లో ప్ర భుత్వ జూనియర్, డిగ్రీ, మెడికల్ కాలేజీలతోపాటు ఆయుష్ దవాఖానను ప్ర భుత్వం ఏర్పాటు చేసింది. గతంలో వికారాబాద్‌ను ఇద్దరు మంత్రులున్నా పట్టించుకోలేదు. కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే వికారాబాద్ ఆర్వోబీ నిర్మాణానికి రూ.96 కోట్లు, వికారాబాద్ మున్సిపాలిటీకి రూ.60 కోట్లను మంజూరు చేసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి మీతోనే ఉన్నా.
మీతో నేను కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశా. మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో పల్లెనిద్ర చేసి.. గల్లీలు, వీధు ల్లో తిరిగి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని.. అవసరమైన నిధులను తీసుకొచ్చి పరిష్కరించా. గతంలో ఉన్న ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటు న్నా. మర్పల్లిలో రోడ్డు నిర్మాణాని కి రూ.12కోట్లు మంజూరయ్యాయి. ఎన్నికలు ముగిసి న తర్వాత పనులు ప్రారంభమవుతాయి. మోమిన్‌పేటలో మైనార్టీ కళాశాల, మర్పల్లిలో ప్ర భుత్వ జూనియర్ కళాశాల, బంట్వారం మం డలంలో ని మాలసోమారంలో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. గెలిచిన నాటి నుంచి మీతోనే ఉన్నా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
తెలంగాణలో సీఎం కేసీఆర్ హవా నడుస్తున్నది. రోజురోజుకూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తల రాకతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులల్లో వణుకు మొదలైనది. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ పదవీబాధ్యతలు చేపట్టడం ఖాయం. పదేండ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రతి ఇంటికీ అందించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రం ఐటీ హబ్‌గా మారింది.
– రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ