కాంగ్రెస్ నుంచి మర్రి నిరంజన్‌రెడ్డి సస్పెండ్
ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు మర్రి నిరంజన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్ట్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిబట్ల, 3 : ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడు మర్రి నిరంజన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్ట్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, సొంత పార్టీ, మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్తీకపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లతో క్యాంపు రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9న అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించగా.. ఇప్పటికే కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంపులకు తరలించారు. వారిపైనా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని, త్వరలోనే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని డీసీసీ, డీసీఏలు పేర్కొన్నారు.
9న చైర్పర్సన్ పై అవిశ్వాసం..
ఈ నెల 9న ఆదిబట్ల మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. చైర్పర్సన్ కొత్త ఆర్తీక, వైస్ చైర్మన్ కోరే కళమ్మపై అవిశ్వాసం పెట్టాలని ఇదివరకే కౌన్సిలర్లు కలెక్టర్‌కు తీర్మానం అందజేశారు. చైర్మన్‌గా మర్రి నిరంజన్‌రెడ్డిని ఎన్నుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో ఇప్పటికే కౌన్సిలర్లను తీర్థయాత్రల పేరుతో క్యాంపులకు తరలించారు. కానీ, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలా, వద్దా అనే ఆలోచనలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం మర్రి నిరంజన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆదిబట్ల మున్సిపల్ రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

