మణికొండ మార్చి 11 : అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెం దాడు. ఈ విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గండిపేటలోని ఎంజీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు స్విఫ్ట్ కారులో మంగళవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి బయలు దేరారు. నియో పోలీస్ సమీపంలోకి రాగానే వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతు న్న శ్రీకర్ (18) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మిగిలిన ఐదుగురిలో హేమసాయి(19), వివేక్ (19), సృజన (18), కార్తికేయ(18), హర్ష (19)కి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో హర్షసాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక వైద్యశాలలో చేర్పించిన పోలీసులు శ్రీకర్ మృతదేహాన్ని ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.