నిరుద్యోగులకు శుభవార్త.. నేడు వికారాబాద్‌లో మెగా జాబ్‌మేళా
జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. 60 కంపెనీలు పాల్గొని దాదాపుగా ఏడు వేల మందికి ఉపాధి కల్పించనున్నారు
- నర్సింగ్ ఫంక్షన్హాల్లో కార్యక్రమం
- పాల్గొననున్న 60 కంపెనీలు..
- టీఎస్ఎస్టీఈపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
- సుమారు 7వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యం
- జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్
వికారాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. 60 కంపెనీలు పాల్గొని దాదాపుగా ఏడు వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి జరుగనున్న జాబ్‌మేళాను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు.
పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ మొదలుకొని పీజీ వరకు, ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ విద్యార్హత ఉన్న వారు జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్‌రావు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు తమ వెంట ఐదు కాపీల బయోడేటాతోపాటు ఆధార్ కార్డు జిరాక్స్‌తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 63042 50542, 99599 03463 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

