Fire Accident | జగద్గిరిగుట్ట, జూన్ 7 (క్రైమ్ స్పాట్) : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రింగ్ బస్తీలో నివాసముండే ఉపేందర్ కుమారుడు సాయి (27) ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. అవివాహితుడైన సాయి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అతను ఇంట్లో ఉండగా తల్లిదండ్రులు గుడికి వెళ్లారు.
అయితే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో సాయి పూర్తిగా మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యాడు. గుడికి వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా పొగలు ఉండటంతో.. వారు స్థానికుల సాయంతో లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సాయి విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తీవ్రంగా కాలిపోయిన సాయి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇనుప మంచం కావడంతో షార్ట్ సర్క్యూట్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతను పడుకున్న బెడ్‌కు మంటలు వ్యాపించగా.. బాధితుడు తప్పించుకోలేక అక్కడే చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు