Woman Missing | నేరేడ్మెట్, మార్చి 19 : ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకనగర్ డివిజన్ సంతోషిమానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎన్. సంధ్యారాణి (పూజారాణి) 24 సంవత్సరాలు. ఈ నెల 15వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇంటినుంచి బయటికి వెళ్లింది. ఈ రోజువరకు ఇంటికి చేరుకోలేదు. భర్త, బంధువులు కలిసి వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం భర్త సంతోష్ నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తామని తెలిపారు.