MLA KP Vivekanand |కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 15 : ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు సంక్షేమ సంఘాలే వారధులని, కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల భాగస్వామ్యం ఎంతో కీలమని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఇవాళ కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 125-గాజుల రామారం డివిజన్ కైలాష్ హిల్స్ కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరించుకొనేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు కాలనీలో నెలకొన్న దోమల బెడద, రోడ్లపై మురుగునీటి ప్రవాహం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వాటిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు కే సందేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే సందీప్, ఉపాధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర రావు, కోశాధికారి రామ సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి పి వేణు, ఎం మాధవ చారి, ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్