Corporator Bonthu Sridevi | చర్లపల్లి, జూన్ 23 : చర్లపల్లి డివిజన్ పరిధిలో డ్రైనేజీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటి సభ్యురాలు, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని మారుతినగర్లో ఆమె కాలనీవాసులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ.. కాలనీలోని నాలా ప్రక్కన రక్షణగా ప్రహారి గోడ నిర్మాణం పనులు చేపడుతామన్నారు. అదేవిధంగా కాలనీలోని ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల నిర్మాణం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
డివిజన్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుం బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన