Virat Shobhayatra | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 7: కేపీహెచ్‌బీ కాలనీ రామసేన ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 12న విరాట్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు కేపీహెచ్‌బీ కాలనీ అధ్యక్షుడు ఎస్ ప్రీతం రెడ్డి తెలిపారు. ఈ మేరకు విరాట్ శోభాయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
కేపీహెచ్‌బీ కాలనీ మూడో పేజ్‌లోని రమ్య గ్రౌండ్ వద్ద సాయంత్రం 5.30 గంటలకు విరాట్ శోభాయాత్ర ప్రారంభమవుతుందని.. కాలనీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న హిందూ బంధువులందరూ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ, కోటేశ్వరరావు, పవన్ కుమార్ వర్మ, కొల్ల శంకర్, తుల్జా గణేష్, వంశీ, రాజారెడ్డి, వెంకట్, సాయి తేజ, ఆకుల రాములు, ప్రకాష్, ప్రేమ్ తదితరులు ఉన్నారు.