కేపీహెచ్‌బీ కాలనీ: మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 3,206 మందికి కరోనా టీకాలు వేసినట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి. మమత తెలిపారు. బుధవారం కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 11 ప్రత్యేక కేంద్రాల ద్వారా కరోనా టీకాలు ఉచితంగా వేయడం జరిగిందన్నారు.
మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా..మూసాపేట డివిజన్లోని అవంతీనగర్ తోట కమ్యూనిటీ హాల్, అల్వాల్ డివిజన్లోని రాజీవ్‌గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, కూకట్పల్లి డివిజన్లోని ఇందిరానగర్ గుడిసెలు, వివేకానందనగర్ డివిజన్లోని ఆర్పీ కాలనీ కమ్యూనిటీ హాల్, ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ రైతుబజార్, కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సాయిబాబానగర్, గాంధీనగర్, రంగారెడ్డినగర్, గాజులరామారం సర్కిల్లోని జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహకల్ప, కైసర్‌నగర్, అల్వాల్ డివిజన్ పరిధిలోని తుర్కపల్లి, ఇందిరానగర్ కమ్యూనిటీ హాళ్లలో కరోనా టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.