Uppal | రామంతాపూర్, మే 30 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ హబ్సిగూడ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో 40 లక్షలు, మధురానగర్ కాలనీలో రూ.కోటితో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పలు కాలనీల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌గా మారుతుందని పేర్కొన్నారు.
అనంతరం కార్పొరేటర్ చేతన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డివిజన్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మాకు సంబధం లేదు. ఉప్పల్ ఇంజనీరింగ్ అధికారులు.
హబ్సిగూడ డివిజన్లో శుక్రవారం జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సం తమకు సంబంధం లేదని ఉప్పల్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే , కార్పొరేటర్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చినప్పటికి అధికారులు అందుబాటులో లేకపోపోవడంతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి ఏఈ అక్కడికి వచ్చారు. ఈ విషయమై ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరగా మాకు సంబంధం లేదన్నారు. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకం వేసిన పనులకు మాత్రమే తాము వెళుతామని చెప్పారు. అయితే శిలా ఫలకం ఏర్పాటు, తేదీ ఖరారుపై అధికారులకు సమాచారం లేదు, సంబంధం లేదని చెప్పడం గమనార్హం. సంబంధం లేకుండానే శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నారా అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.