పీర్జాదిగూడ ఫిబ్రవరి 19 : రానున్న 18 నెలల్లో ఉప్పల్ – ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి బోడుప్పల్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కేశవనగర్ కాలనీలో నిర్వహించిన శ్రీ అన్నపూర్ణ దేవి సహిత విశ్వనాథస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మంత్రికి వేద బ్రాహ్మణులు పూర్ణకుంభం, మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అరుదుగా ఉండే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని బోడుప్పల్ ప్రాంతంలో నిర్మించిన ధర్మకర్తలకు, కాలనీ ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఉప్పల్ ఘట్ కేసర్ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి బోడుప్పల్ పీర్జాదిగూడ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు ఇల్లు కట్టించే అందిస్తామన్నారు. ప్రజా ప్రభుత్వ ప్రయత్నానికి ఆ కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలని అలానే అద్భుతమైన శిల్పాలతో ఆలయాన్ని నిర్మించిన శిల్పులకు, ఆలయ నిర్మాణానికి పూనుకున్న దాతలకు, ప్రజలకు ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా శుభాభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, నాయకులు పోగుల నరసింహారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,ఆలయ కమిటీ సభ్యులు,కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.