మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 30 : మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు నెలల జీతాలు, బిల్లులు చెల్లించాలని సిఐటియు జిల్లా కోశాధికారి ఉన్ని కృష్ణన్ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు, బిల్లులు చెల్లించాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల బిల్లులు ఇవ్వకుండా పిల్లలకు అన్నం ఎలా పెడతారన్నారు. కార్మికులు అప్పులు పాలు అవుతున్నారని, మూడు నెలలు జీతాలు, బిల్లులు వెంటనే ఇవ్వాలని కోరారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.