కుత్బుల్లాపూర్(మేడ్చల్) : కుత్బుల్లాపూర్‌లో లింక్‌రోడ్లను (Link roads) వెలుగులోకి తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand ) ఆయా విభాగాల అధికారులకు సూచించారు.
మంగళవారం పేట్ బషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్డీసీఎల్), కుత్బుల్లాపూర్-గాజులరామారం (Gajula Ramaram) జంట సర్కిళ్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్-44 హనుమాన్ టెంపుల్ ఫాక్స్‌సాగర్ మీదుగా రాంరెడ్డినగర్ ఇండస్ట్రీయల్ ఏరియా వరకు రూ. 29 కోట్లతో చేపట్టనున్న లింక్ రోడ్ల పురోగతిపై చర్చించారు.
రూ.30 కోట్లతో కైసర్ నగర్ హనుమాన్ రెండి ఎల్లమ్మ బండ, మహాదేవపురం వెటర్నరీ హాస్పిటల్ వరకు లింకురోడ్డు పనుల గురించి వాకబు చేశారు. లింక్‌రోడ్లను సకాలంలో పూర్తి చేస్తే ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, జంట సర్కిళ్ల డీసీలు, తదితరులు పాల్గొన్నారు.