Telugu Panchangam | కుత్బుల్లాపూర్, మార్చి 30 : ఉగాది తెలుగు నూతన సంవత్సర పంచాంగం వాసుదేవ పీఠం పంచాంగ ఆవిష్కరణ కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర నగర్ సత్ జ్ఞాన్ హైస్కూల్లో సత్ జ్ణాన్ హైస్కూల్ కరెస్పాండెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర ఉపాధ్యక్షుడు లయన్ చింతల మల్లేశం ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లయన్ చింతల మల్లేశం మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సరం ప్రతీవారి జీవితంలో మరి ప్రతి ఒక్కరిలో నూతన కాంతులు వెలగాలని.. ఈ నూతన సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితాల్లో మరుపురాని తీపి గుర్తుగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య తిరుమల వేంకటశేషాద్రి, తిరుమల శ్రీధరాచార్యులు, మంగవెల్లి పాండు రంగాచార్యులు, దరూరి గిరిధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్