శామీర్పేట, మార్చి 24 : విద్యార్థి దశ నుంచే విద్యాబుద్ధులతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి సూచించారు. హైదరాబాద్లోని ప్రగతి మహా విద్యాలయ విద్యార్థులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లాల్గడి మలక్పేట గ్రామంలోని ఎన్సీసీ క్యాంప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శోభారాణి మాట్లాడుతూ.. యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు. అలాగే మంచి చెడులతో పాటు సామాజిక సేవలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్త్రీలను గౌరవించడం, పెద్దల పట్ల గౌరవం, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో భాగంగా లాల్గడిలో పచ్చదనం, పరిశుభ్రత, చెట్లు పెంచడం, పాఠశాలలు శుభ్రం చేయడం, విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర క్రమశిక్షణ స్వయం పాలనపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.