నేరేడ్మెట్, జూలై 18 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆనంద్‌బాగ్ చౌరస్తాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మాత్సవాల ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు, అర్చకులు తులసి వెంకట రమణాచార్యులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఇలాంటి పండుగలు మన సంస్కృతిని, భక్తి భావాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి బహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరారు.