శామీర్ పేట్, మే 19 : సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా.శ్రీదేవి అన్నారు. రైతు వద్దకు శాస్త్రవేత్తలు కార్యక్రమం మూడుచింతలపల్లి మండలం లక్ష్మా పూర్ గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.శ్రీదేవి మాట్లాడుతూ.. యూరియా వాడకం, పంట మార్పిడి, చెట్లు పెంపకం, రశీదులు, రసాయనిక మందుల వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించామన్నారు.
సరైన పద్ధతులలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందే అవకావం ఉంటుందన్నారు. అలాగే అదనంగా పలు చీడపీడలు, యాజమాన్యం, విత్తన ఎంపిక, నేల యాజమాన్యం, భూసార పరీక్ష వంటి అంశాల గురించి చర్చించి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమలో లక్ష్మాపూర్ గ్రాములు, రైతులు, ఆదర్శ రైతులు, విద్యార్థులు, మండల వ్యవసాయ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.