కేపీహెచ్బీ కాలనీ, మే 17: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ డివిజన్ సర్దార్ పటేల్ నగర్లోని శ్రీలక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 22 న గురువారం అంకురార్పణం పూజలతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ నెల 23వ తేదీన శుక్రవారం ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవ ఊరేగింపు, గరికపాటి నరసింహారావు చే ప్రవచనాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే 24న శనివారం సింహ వాహన సేవ, ఊరేగింపు, సర్వభూపాల వాహన సేవ, శ్రీ అకెల్ల విభీషణ శర్మ ప్రవచనాలు ఉంటాయని చెప్పారు. 25వ తేదీ ఆదివారం నాడు పల్లకి ఉత్సవం, ఊరేగింపు, గరుడ వాహన సేవ పూజలు, 26న సోమవారం సూర్యప్రభ వాహన సేవ ఉత్సవమూర్తులకు వసంతోత్సవం గజవాహన సేవ ఊరేగింపు, 27న మంగళవారం చక్రస్నానం, శ్రీరామ్ గణపతి ప్రవచనాలు మహా పూర్ణాహుతి, 28న బుధవారం శ్రీ పుష్పయాగం, శ్రీవారి కల్యాణ మహోత్సవ వేడుకలు ఉంటాయని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.