రామంతాపూర్, ఆగస్టు : రామంతాపూర్ శ్రీరామకాలనీ విశ్వకర్మ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులు యాలాల వెంకటేశం, పులిమామిడి బాలకృష్ణాచారి పబ్బోజు బిక్షపతిచారి, కొడపర్తి రామచంద్రచారి,ముఖ్యసలహాదారుడుగా సుంకోజు నారాయణచారి, అధ్యక్షుడుగా గొట్టోజు రవిచారి, ప్రధాన కార్యదర్శిగా బత్తోజు నర్సింహచారి, కోశాధికారిగా అకోజు ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా నండంచారి, సంయుక్త కార్యదర్శిగా జ్ఞానేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రవిచారి మాట్లాడుతూ సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తూ , విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.