Sree Veeranjaneya swamy | దుండిగల్, ఏప్రిల్ 4: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండి మైసమ్మ, గణేష్ నగర్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నేత శంభీపూర్ కృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, రాము గౌడ్, సాయి యాదవ్, మాజీ సర్పంచ్ ఆకుల నవీన్, బీఆర్ఎస్ మున్సిపల్ బీసీ శాఖ అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్, బౌరంపేట పీఏసీఎస్ డైరెక్టర్ జీతయ్య, యూత్ నాయకులు శ్రీకాంత్ రెడ్డితోపాటు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్