TGSRTC | కాప్రా, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో జరిగే జాతర కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు కుషాయిగూడ డిపో మేనేజర్ బి.మహేశ్‌కుమార్ తెలిపారు. ఆఫ్జల్‌గంజ్, తార్నాక, లాలాపేట, మౌలాలి హౌజింగ్ బోర్డు, ఈసీఐఎల్, కుషాయిగూడ మీదుగా ఈ బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.
ఈ నెల 26వ తేదీన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే కల్యాణానికి వచ్చే భక్తుల కోసం కుషాయిగూడ ఆర్టీసీ డిపో అన్నివిధాలుగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసిందని మహేశ్‌కుమార్ తెలిపారు. ఈ ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా కీసర గుట్ట బస్టాండ్ వరకు అంటే.. గుడి ప్రాంగణం దగ్గర వరకు ప్రయాణికులను చేరవేస్తాయని చెప్పారు. దర్శనం తర్వాత బస్సులను బస్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.