Software Employee | కుత్బుల్లాపూర్: టెక్ మహీంద్ర (Tech Mahindra)లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భావన అనే ఉద్యోగిని తనను అకారణంగా కంపెనీ విధుల నుంచి తొలగించారని గతంలో దుండిగల్ పోలీసులను ఆశ్రయించిందని తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా మూడు రోజులు సెలవు తీసుకుంటే యాజమాన్యం వేధింపులకు గురిచేస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు కూడా దిగింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కలిసేందుకు ముంబైకి వెళ్లింది.
ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ.. నేను ముంబైలో ఉన్న టెక్ మహీంద్ర హెడ్ ఆఫీస్‌కు వచ్చాను. వాళ్లు కనీసం ఆనంద్ మహీంద్రను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అప్పుడు కూడా వాళ్లు ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చారు. దాని ద్వారా వెళ్లాలట. ఇలాంటి మనుషులకు మనం మన స్టేట్‌లో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంటాం. ఈ రాష్ట్రంలో మాకు ఎలాంటి సాయం కూడా అందడం లేదు. నేను ఇప్పటికే ముంబై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాను. ఇది మీ రాష్ట్రంలోని సమస్య. మీరు అక్కడే తేల్చుకోవాలని వారు అన్నారంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాళ్లను టర్మినేట్ చేసేదాకా వదలనన్న భావన..
గతంలో ధర్నా సందర్భంగా భావన మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇటీవలే జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఉద్యోగాలకు వందలాది మంది వస్తే ఇంటర్వ్యూలో పాసై ఉద్యోగంలో చేరాను. జూన్ నెలలో నాకు ఆరోగ్యం బాగా లేదు. ఫ్లోర్ మీదనే పడిపోయా. వాళ్లు ఇక్కడి నుంచి యూనివర్సిటీలో ఉన్న చిన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి తన కండిషన్ బాగా లేదు.. మల్లారెడ్డికి తీసుకెళ్లండి అని చెప్పారు. అక్కడినుంచి నేను మల్లారెడ్డి ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ కూడా సౌకర్యాలు సరిగా లేవని మా ఆయన నన్ను ఇంటి దగ్గరున్న ఆస్పత్రికి మార్చారు.
మీరు చాలా రోజుల నుంచి కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్నారు. కాబట్టి మీకు స్పాండిలైటిస్ అయ్యి ఉండొచ్చు. దానికి ట్రీట్ మెంట్ తీసుకోండి అని చెప్పారు. స్పాండిలైటిస్ ట్రీట్ మెంట్ తీసుకునేందుకు 15 రోజులు ఫిజియో థెరపీ ఉంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వారికి సమర్పించాను. ఆ తర్వాత ఆ 14 రోజుల టైంలో నాకు బెదిరింపు ఈ మెయిల్స్ వస్తున్నాయి. మీరు రిపోర్ట్ చేయట్లేదు.. చాలా సార్లు కాల్ చేశారు.. మీరెప్పుడొస్తున్నారు.. అని అడిగారు కానీ మీకెలా ఉంది.. మీ ఆరోగ్యానికి ఏమైంది.. అని ఎవరూ కూడా అడగలేదంటూ భావన ఆవేదన వ్యక్తం చేసింది.
శుక్రవారం మా పాపకు బాగా లేదని కాల్ చేసి చెప్పాను. శనివారం పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాను. అందుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఇచ్చినా కూడా వాళ్లు నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు. వాళ్లకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు.. కాబట్టి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని మెయిల్ పెట్టారు. నేనెక్కడా వాళ్లకు కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో.. నాకైతే తెలియలేదు. 22న ఆఫీస్‌కు రమ్మన్నారు. వచ్చాక నేను ఇలాంటి భయానక వాతావరణంలో పనిచేయలేనని అనిపించింది. ఏదైనా సరే అని పీఎస్‌కు వెళ్లాను. పిటిషన్ తీసుకుని రషీదు ఇచ్చారు. సడెన్‌గా ఉద్యోగంలో నుంచి తీసేస్తే నా కుటుంబం పరిస్థితి ఏంటి..? ఎవరైతే నన్ను జాబ్ లో నుంచి తీసేశారో..ఎవరైతే నాకు ఈ మెయిల్ చేశారో.. వాళ్లందరినీ టర్మినేట్ చేసేదాకా నేను వదలను.. ఇక్కడే కూర్చుంటా అని భావన చెప్పింది.
ఆనంద్ మహీంద్రాను కలవనీయడం కలవడంలేదు
మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ తనను అకారణంగా జాబ్‌లో నుంచి తీసివేశారని గతంలో నిరసనకు దిగిన భావన శర్మ అనే మహిళ
పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదన
ఈ నేపధ్యంలో న్యాయం కోసం ఆనంద్… https://t.co/MVgK6S3JjG pic.twitter.com/UDtxjdBbbP
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత