నల్లగొండ, సెప్టెంబర్ 12 : రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని అన్ని కోర్ట్ ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడింది. ఈ లోక్ అదాలత్ కోసం జిల్లా వ్యాప్తంగా 14 లోక్ అదాలత్ బెంచీలను ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ లో 33- సివిల్, 2,813 – క్రిమినల్, 68- మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, అలాగే 9,281-ట్రాఫిక్ చలాన్ కేసులు, 77 -బ్యాంకు రికవరీ కేసులు, 11 – సైబర్ క్రైమ్ కేసులు, మొత్తం – 12,283 (పెండింగ్ అలాగే ప్రి-లిటిగేషన్) కేసులు పరిష్కరించబడినవి. ఇందులో ప్రమాద బీమా కేసులలో రూ.7,62,44,348/- నష్ట పరిహారం ఇప్పించగా, బ్యాంకు రికవరీ – రూ.6,21,7,000/-, ట్రాఫిక్ చలాన్ రూ.31,32,180/, సైబర్ క్రైమ్ కేసులలో రూ.1,17,262/- రికవరీ డబ్బులు యిప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి పి.వసంత్, కార్యదర్శి హిమబిందు గొల్ల, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎ.సతీష్ కుమార్, బి.అశోక్ కుమార్, ఇతర న్యాయవాదులు, బ్యాంక్, బీఎస్ఎన్ఎల్ అండ్ ఇతర ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫీసర్స్, కక్షిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.