గాజుల రామారం, జులై 19 : టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎమ్మెల్సీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఆయన గులాబీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఆయన తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి, నియోజకవర్గం టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు విజయ్రామిరెడ్డి, ఏర్వ శంకరయ్య, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మల్లేష్‌గౌడ్, పాపయ్యగౌడ్, పాపిరెడ్డి, దూడల భాస్కర్‌గౌడ్, డివిజన్ యూత్ అధ్యక్షుడు రాయి విఘ్నేష్, కె.సురేష్, అరవింద్‌కుమార్, మురళీ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.