శామీర్‌పేట, జూలై 3 : బీఎల్వోలు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపల్ పరిధిలో బీఎల్వోలకు వారం రోజుల నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటరు జాబితా, ఓటు నమోదు వంటి అంశాలను సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తారన్నారు.
మండలాల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి రోజు మేడ్చల్ మండలం, మేడ్చల్, గుండ్లపోంచపల్లి మున్సిపాలిటీలు, కాప్రా పరిధిలోని బీఎల్వోలు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిబిరాన్ని సద్వనియోగం చేసుకోవాలని బీఎల్వోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శామీర్‌పేట తాసీల్ధార్ యాదగిరిరెడ్డి, మేడ్చల్ కమిషనర్ చంద్రప్రకాశ్, గుండ్లపోచంపల్లి కమిషనర్ స్వామి, మేడ్చల్ డిప్యూటీ తాసీల్ధార్ జి.సునీల్‌కుమార్, ఆర్ఐ రాఘవ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.