పోచారం, ఏప్రిల్22 : 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇంటి పన్నులపై ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని పోచారం మున్సిపాలిటీ ప్రజలు ఉపయోగించు కోవాలని కమిషనర్ వీరారెడ్డి కోరారు. ఇంటి పన్నులపై 5శాతం రాయితీతో చెల్లించడానికి ఈనెల 30 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు.
గత సంవత్సర బకాయిలు కూడా ప్రజలు చెల్లించి రాయితీని పొందవచ్చునని కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఇంటి పన్నుల కింద మొత్తం రూ.18 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 60 శాతం వసూలు అయ్యాయని అన్నారు. ఎల్ఆర్ఎస్ పై కూడా ప్రభుత్వం ఈనెల 30 వరకు 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.