మేడిపల్లి : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పర్వతాపూర్ గ్రామ పరిధిలోగల సాయిప్రియ కాలనీలో హోలీ సంబురాలు ఫుల్ జోష్తో జరిగాయి. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆనందోత్సాహాలతో రంగులపండుగ చేసుకున్నారు. కాలనీకి చెందిన మహిళలు ఒకరికొకరు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. డీజే పాటలు పెట్టుకుని నృత్యాలు చేశారు.
పిల్లలు శుక్రవారం తెల్లవారడమే ఆలస్యం హోలీ సెలెబ్రేషన్స్ మొదలుపెట్టారు. గుంపుగుంపులుగా గల్లీగల్లీ తిరుగుతూ స్నేహితులపై రంగులు చల్లుకుంటూ, ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సందడి చేశారు. పిల్లల ఆటలతో, కేరింతలతో గల్లీల్లో పండుగ కళ ఉట్టిపడింది. మహిళలు, పిల్లలతోపాటు కాలనీకి చెందిన పురుషులు కూడా హోలీ ఉత్సవాల్లో మునిగితేలారు.
Holi In Saipriya
ఉదయం నుంచే ఒకరికొకరు రంగులు పూసుకుంటూ రంగుల పండుగను ఎంజాయ్ చేశారు. డీజే పాటలు పెట్టుకుని జోరుగా డ్యాన్సులు వేశారు. ఇదిలావుంటే ముందురోజు రాత్రి కాలనీ వాసులు పెద్దమ్మతల్లి గుడి దగ్గర కామ దహనం చేశారు. కాగా, కాలనీలో జరిగిన హోలీ సంబురాలకు సంబంధించిన కొన్ని దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..