చర్లపల్లి, జూలై 17 : పెట్రోలియం ట్యాంకర్ల డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొవాలని సీఐటీయూ రాష్ట్ర పధాన కార్యదరి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్3లోని బీపీసీఎల్ పరిశ్రమ వద్ద డ్రైవర్లు, హెల్పర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేసుకొని సీఐటీయూ జెండాను ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక రవాణా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్ల, సహాయకులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య భీమా, ప్రమాద భీమా, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకొవాలని ఆయన కోరారు.
డ్రైవర్లపై భారీ జరిమానాలు, శిక్షలు వేయ్యడం సరికాదని, మోటర్ వాహనాల చట్టాన్ని న్యాయంగా అమలు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశోక్, చంద్రశేఖర్, కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీనివాసులు, బంగారు నర్సింగ్‌రావు, చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, శ్రీనివాసులు, రమేశ్, బీపీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఆశోక్‌గౌడ్, షరీఫ్, మల్లేశ్, అంజనేయులు, నాగస్వామి, రాజరెడ్డి, చిన్న కేశవులు, మహేశ్, కుమార్‌స్వామి, నాగరాజు, గంగాధర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.