హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా శామీర్పేట బస్టాండు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న స్కూటరును వాయువేగంతో వచ్చిన బైకు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద ధాటికి రెండు వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు.