MLC Shambhipur Raju | దుండిగల్, మే 25 : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని ప్రతీ కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్ పల్లిలోని ప్రణీత్ ఫ్లోరా కాలనీ వాసుల ఆహ్వానం మేరకు కాలనీలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ.. ప్రతీ కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ భరత్ కుమార్, కాలనీ ప్రెసిడెంట్ నాగమణి, వైస్ ప్రెసిడెంట్ హరీష్, సభ్యులు పెద్దినేని, నాగరాజు లతోపాటు కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.