National Training Programme | శామీర్‌పేట, జులై 3 : బీఎల్వోలు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపల్ పరిధిలో బీఎల్వోలకు వారం రోజుల నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఓటరు జాబితా, ఓటు నమోదు వంటి అంశాలపై సలహాలు, సూచనలతోపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని.. మండలాల వారిగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి రోజు మేడ్చల్ మండలం, మేడ్చల్, గుండ్లపోంచపల్లి మున్సిపాలిటీలు, కాప్రా పరిధిలోని బీఎల్వోలు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీఎల్వోలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో శామీర్‌పేట తహసీల్దార్ యాదగిరిరెడ్డి, మేడ్చల్ కమిషనర్ చంద్రప్రకాశ్, గుండ్లపోచంపల్లి కమిషనర్ స్వామి, మేడ్చల్ డిప్యూటీ తహసీల్దార్ జి సునీల్‌కుమార్, ఆర్ఐ రాఘవ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్