NTR Birth Anniversary | కేపీహెచ్బీ కాలనీ, మే 28 : తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీ వసంత నగర్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలు మరువలేనివి అన్నారు. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి సుపరిపాలన అందించారన్నారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో తాను నడుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మందలపు సాయిబాబా చౌదరి, శ్యామల రాజు, సొసైటీ అధ్యక్షుడు ఎర్ర నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో..
జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహానికి జనసేన ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అట్లూరు దీపక్, కొల్లూరి శ్రీనివాసరావు, కొల్లా శంకర్, సుబ్బు, శంకర్రావు, శివ నారాయణ, ప్రవీణ్, రవి, కిషోర్ బాబు తదితరులు ఉన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు