బోడుప్పల్ ఫిబ్రవరి 9: అంబేద్కర్(Ambedkar )ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య పిలుపునిచ్చారు. బోడుప్పల్ కేంద్రంగా గత 312 ఆదివారాలుగా జ్ఞానమాల సమర్పణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఆయన అన్నారు ఈ మేరకు ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక, స్వేచ్ఛ, సమానత్వం, రాజకీయ ఫలాలు అందడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు.
అనంతరం అంబేద్కర్ ఆశయాలను, స్ఫూర్తిని బడుగు బలహీన వర్గాలకు చేరవేస్తూ కుల రహిత సమాజ సాధనకు కృషి చేస్తున్న రాపోలు శంకరయ్యను ఆయన సన్మానించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట దేవస్థాన డైరెక్టర్ గా రాపోలు శంకరయ్యకు అవకాశం రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో దానగళ్ళ యాదగిరి, ఐలయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు శివ, శ్రీకాంత్, శ్రీరాములు, యాకయ్య, బాబు, సురేష్, బయన్న తదితరులు పాల్గొన్నారు.