జవహర్‌నగర్, సెప్టెంబర్ 18: మహిళ హత్య కేసును జవహర్‌నగర్ పోలీసులు ఛేదించారు. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌లోని బజరంగ్కాలనీలో నివాసముంటున్న వివాహిత(35) ఈనెల 11న అదృశ్యమైంది. రెండురోజుల తర్వాత వికలాంగుల కాలనీలో శవమై కనిపించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇంటి పక్కనే ఉండే అత్తింటి ఆంజనేయులు ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. కొన్నాళ్లుగా సదరు మహిళను లైంగికంగా వేధిస్తున్న ఆంజనేయులు..అప్పు ఇస్తానని చెప్పి.. ఆమెను వికలాంగుల కాలనీ వెనుకాల ఉండే అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. లైంగికదాడి చేయబోయాడు. ప్రతిఘటించడంతో తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.