పోచారం,అక్టోబర్6 : అనుమతి లేని ఓయో హోటల్ భవనాన్ని పోచారం మున్సిపాలిటీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని మార్కెట్ రోడ్డు సమీపంలోని భరత్ నగర్లో ఉన్న ఈ భవనంలో ఓయో హోటల్‌ను నిర్వహిస్తుండడంతో రాత్రిపూట వాహనాలు రావడం, మద్యం సేవించి ఒక్క వాహనం పై ముగ్గురు నుంచి ఐదుగురు ఇక్కడికి రావడంతో స్థానిక నివాస ప్రాంతాల ప్రజలు అభ్యంతరం తెలుపుతూ పోలీసులు, మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన పోచారం మున్సిపాలిటీ ఆర్ఐ కోటా వెంకటేశ్వర్లు, సానిటరీ అధికారి సాయిరాజ్ సిబ్బందితో వెళ్ళి సీజ్ చేశారు. గత వారం రోజుల క్రితమే ఓయో నిర్వహకులకు ఎలాంటి అనుమతి పత్రాలు ఉన్నాయో చూపాలని మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిర్వాహకులు పట్టించుకోక పోవడంతో భవనాన్ని సీజ్ చేశారు.