దుండిగల్, ఫిబ్రవరి 22: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు శనివారం కలిశారు. శంభీపూర్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తిపై శంభీపూర్ రాజు సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అదేవిధంగా పలు ప్రాంతాలలో జరిగే శుభకార్యాలలో పాల్గొనాలని పలువురు ఆయనకు ఆహ్వాన పత్రాలను అందజేశారు.