వినాయక్‌నగర్, ఆగస్టు 21: డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం వెంకటాపురం డివిజన్ మారుతీనగర్‌లో రూ.50లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అప్పటి జనసాంద్రతను బట్టి పైపులైన్లు వేశారని అన్నారు. ప్రస్తుతం కాలనీలు వెలుస్తుండడంతో జనసాంద్రత ఎక్కువై మురుగు నీరు పారలేక రోడ్లపై పారుతుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొత్త యూజీడీ నిర్మించిన తర్వాత సమస్యలు ఉండవని అన్నారు. పనులను వేగవంతంగా పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, అధ్యక్షుడు అనిల్‌కిశోర్, యాదగిరి, సుభాష్, జయరాజ్, రాజు, హరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.