వినాయక్‌నగర్, అక్టోబర్ 1: ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారం డివిజన్ ఎంఈఎస్ కాలనీలో తాగు నీటి నల్లాను ఎమ్మెల్యే, కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే అల్వాల్ సర్కిల్లో రూ.199 కోట్లతో తాగు నీటి పథకం పనులు జరుగుతున్నాయన్నారు. దాదాపు మూడున్నర కోట్లతో సాయి బృందావన్ కాలనీ నుంచి ఐస్ ఫ్యాక్టరీ వరకు సీసీ రోడ్డు వేస్తామని, ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కొరత లేదని, కాలనీల్లో సర్వే చేయించి అవసరమైన కాలనీల్లో సీసీ రోడ్లు వేయిస్తామని అన్నారు. కార్యక్రమంలో డీసీ నాగమణి, వాటర్ వర్క్స్ ఆఫీసర్ రమేశ్, కాలనీ ప్రెసిడెంట్ పెంటయ్య, కార్యదర్శి ప్రభుదాస్, వేణు, ప్రతాప్, రవీందర్, కృష్ణకుమార్, రాజిరెడ్డి, సర్కిల్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, దేవిక, సరిత, సులోచన, విజయ, శ్రీనివాస్‌గౌడ్, పరమేశ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.