మల్కాజిగిరి/కంటోన్మెంట్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ అంకురార్పణ చేస్తున్న దళిత బంధు పథకం చరిత్రలో నిలుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. దళితుల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి దళిత బంధు పథకానికి రూపకల్పన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం పికెట్‌లోని అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడి నుంచి కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయం వద్ద భారీ వాహనశ్రేణితో హుజూరాబాద్ సభకు సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ దళిత బంధు పథకం ప్రారంభంలో భాగస్వాములమయ్యే అద్భుత అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ మహంకాళి శర్విన్, టీఆర్ఎస్ నేతలు ముప్పిడి మధుకర్, నివేదిత, నర్సింహ ముదిరాజ్, కసిరెడ్డి నరేందర్‌రెడ్డి, పనస సంతోష్, తేజ్‌పాల్, మురళీయాదవ్, పిట్ల నగేష్, లతా మహేందర్, కుమార్ ముదిరాజ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మల్కాజిగిరి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, దళితులు తరలివెళ్లారు. సోమవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నాయకత్వంలో వేల మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, దళితులు ర్యాలీగా వెళ్లారు. ముందుగా ఆనంద్‌బాగ్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్లు ప్రేంకుమార్, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ ఎన్. జగదీశ్‌గౌడ్, సర్కిల్ అధ్యక్ష, కార్యదర్శులు పిట్టల శ్రీనివాస్, జీఎన్వీ సతీష్‌కుమార్ నాయకులు బద్ధం పరుశురాంరెడ్డి, గుండనిరంజన్, రాముయాదవ్, ఉపేందర్‌రెడ్డి, రావుల అంజయ్య, అమీనుద్దీన్ కార్యకర్తలు తరలివెళ్లారు.