మల్కాజిగిరి, మే 10: స్మశానవాటికలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajashekar Reddy) అన్నారు. శనివారం బోయిన్‌పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మచ్చ బొల్లారం డివిజన్ బంధం భావి తుర్కపల్లికి చెందిన హిందూ స్మశాన వాటికలో మౌలిక సదుపా యాలు కల్పించాలని కోరుతూ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అల్వాల్ డివిజన్‌కు చెందిన వినీత్ కు రూ.75 వేలు, వహీదా బేగంకు రూ.28 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలోని స్మశాన వాటికల్లో సర్వే నిర్వహిస్తామని అన్నారు. స్మశాన వాటికలో పవర్ బోరుతోపాటు స్థానపు గదులను, కూర్చోడానికి బల్లలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మంద శోభన్, రమేష్, పరమేష్ , పవన్, సూర్య కుమార్, దేవేందర్, కార్తీక్ , చంద్రకుమార్, వినోద్, బాలేష్, నవీన్, వెంకట్, ఉపేందర్, పవన్, ఆరిఫ్ , రేవంత్ రెడ్డి, దేవేందర్, అరుణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.