అల్వాల్ అగస్టు21 : ప్రజల అవసరాలకు అనుకూలంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మచ్చబొల్లారం డివిజన్ కీర్తి నగర్ కాలనీకి సంబంధించి ధర్మకంట నుండి డీ మార్ట్ వెళ్లే రోడ్డు గ్రీన్ ల్యాండింగ్ మెయిన్ రోడ్డు వరకు అసంపూర్తిగా ఉన్న రహదారులను వేంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలసి వినతి పత్రం అందజేశారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి సంబధిత అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కూకట్పల్లి జోనల్ కమిషనర్‌ను కలిసిన కీర్తి నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కీర్తి నగర్ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ఎస్ఈ చిన్నరెడ్డి లను కలసి కాలనీలో ఉన్న సీసీరోడ్లు వివిధ సమస్యలను పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. వెంటనే అధికారులు సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా సమస్య పరిష్కరం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కీర్తి నగర్ కాలనీ అధ్యక్షులు నవీన్‌కుమార్, శ్రీనివాస్, ప్రభ తదితరులు పాల్గొన్నారు.