కుత్బుల్లాపూర్, డిసెంబర్14 : కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల చౌరస్తాలో కుత్బుల్లాపూర్ మండల బీఎంఎస్ యూనియన్ జెండాను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామి ఇచ్చారు. కార్మికులకు ప్రభుత్వం అందించే ప్రమాద బీమా, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించేలా తనవంతు కర్తవ్యంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు రవిశంకర్, అధ్యక్షులు వెంకట్ మహేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు శ్రీవాత్సవ, శంకర్, బాలయ్య, శేఖర్, రాజు, కాశయ్య, గోవింద్, ఎట్టయ్యలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను తన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలను అందించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఫోన్లైన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.