జీడిమెట్ల, ఆగస్టు 27 : దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం గాజులరామారం డివిజన్, హెచ్ఏఎల్ కాలనీ, వెంకటాద్రిహిల్స్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ధ్వజ స్తంభప్రతిష్ఠ , శ్రీ వీరాంజనేయ స్వామి, నాగ దేవత విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాలకు ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వెంకట సుబ్బ య్య, చైర్మన్ జగన్ గౌడ్, అధ్యక్షుడు యాదగిరియాదవ్, నాయకులు అంజన్యాదవ్, గణేశ్‌సింగ్, శ్రీనివాస రావు, సత్యరావు, సతీశ్‌బాబు, అముర ఇంద్రసేనగుప్తా, కమలాకర్, శ్రీనివాస్‌యాదవ్, వీరయ్య చౌదరి పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం సుభాష్‌నగర్ డివిజన్, డీపీ కాలనీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వా మి ఆలయం వద్ద దేవదాయ ధర్మదాయ శాఖ ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సభ్యులంతా ఆలయాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి, ఆలయ ఈఓ అరుణకుమారి, ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, చైర్మన్ కీసర సుధీర్‌రెడ్డి, ధర్మకర్తలు జితేంద్రగుప్తా, రాజేందర్, వీరేశంగౌడ్, కనకమ్మ, ప్రభాకర్, అర్చకులు శంకర్శాస్త్రీ పాల్గొన్నారు.