దుండిగల్,జూలై5: కుత్బుల్లాపూర్‌ను అభివృద్ధి చేసి, రాబోయే రోజుల్లో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మె ల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు తెలిపారు. సోమవారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.2.15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు.
18వ వార్డులో రూ.5 లక్షలతో చిల్డ్రన్ పార్క్, రూ.12 లక్షలతో బీటీ రోడ్డు, 19వ వార్డులో రూ.17 లక్షలతో బీటీ రోడ్డు, 20వ వార్డులో రూ.17 లక్షలతో బీటీరోడ్డు, రూ.10 లక్షలతో భూగర్భడ్రైనేజీ, రూ.5 లక్షలతో ఓపెన్‌జిమ్, 26వ వార్డులో రూ.5 లక్షలతో ఓపెన్‌జిమ్, రూ.10లక్షలతో సీసీరోడ్డు, రూ.17 లక్షలతో బీటీ రోడ్డు, 19వ వార్డులో రూ.10లక్షలతో డ్రైనేజీ, 17వ వార్డులో రూ.10లక్షలతో డ్రైనేజీ, 18వ వార్డులో రూ.10లక్షతో సీసీరోడ్డు, 16వ వార్డులో రూ.12 లక్షలతో బీటీ రోడ్డు, రూ.75 లక్షలతో శ్మశానవాటికల్లో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం భౌరంపేట్‌లో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బాలమని, మౌనిక, సునీత, వనిత, గోపాల్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.