కుత్బుల్లాపూర్ జోన్ బృందం,జూలై 2: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెండోరోజు హరితహారం, పట్ణణ ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్‌రాజు ముఖ్యఅతిథులుగా పాల్గొని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 2,3,4,5 వార్డుల్లో పట్టణప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ సుంకరికృష్ణవేణికృష్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల మొక్కలు నాటారు. గాజులరామారంలోని జగద్గిరిగుట్ట బీరప్పనగర్,కుత్బుల్లాపూర్‌లోని జీడిమెట్ల డివిజన్లో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి12 డివిజన్లో నిర్వహించిన పట్టణప్రగతి కార్యక్రమంలో మేయర్కొలన్ నీలాగోపాల్‌రెడ్డి,కమిషనర్ గోపి పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1వ డివిజన్ క్రాంతినగర్,13వ డివిజన్ వినాయకనగర్, 28వ డివిజన్లో పట్ణణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు లో పట్టణ ప్రగతి నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్‌చైర్మన్ గంగయ్యనాయక్,ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి,కమిషనర్ రఘు, కౌన్సిలర్ డప్పు కిరణ్ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.
కుత్బుల్లాపూర్,గాజులరామారం పరిధిలోని పలు డివిజన్ల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్,ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు,అధికారులు,నేతలతో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు.